Thursday, April 23, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే..

రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే..

- Advertisement -

– గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించుకుంటే కావాల్సింది ఏముంటుంది : సుప్రీంకోర్టు
– కొత్త గవర్నర్‌కు కొంత సమయం కావాలని కోరిన అటార్నీ జనరల్‌ ొ అందుకు అనుమతిస్తూ… తదుపరి విచారణ జులై 22కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

”గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది” అని తెలంగాణ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ నియామక కేసులో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ విధంగా రాజ్యాంగ సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే… కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని 2024, ఆగస్టు 4న దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్రా సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ నియామకాన్ని పక్కనపెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని వారు సవాల్‌ చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ విజరు బిష్ణోరులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. గవర్నర్‌ కార్యాలయం తరఫున అటార్నీ జనరల్‌ వెంకటరమణి హాజరై వాదనలు వినిపించారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌ బాధ్యతలు స్వీకరించారని కోర్టుకు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం పంపిన పంపిన కొత్త ఎమ్మెల్సీల (కోదండరాం, అజారుద్దీన్‌) సిఫారసులకు సంబంధించి ఈ నెల 31తో ఆరు నెలల గడువు ముగు స్తుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో కొత్త గవర్నర్‌ సంబంధిత అంశంపై ఒక స్పష్ట మైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తు లకు ఇలాంటి వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడానికి తగిన వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరముందన్నారు.అందువల్ల గవర్నర్‌కు కొంతసమయం ఇవ్వాలని అభ్యర్థించారు.
పూర్తి అవకాశం ఇస్తున్నాం….
అటార్నీ జనరల్‌ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొత్త గవర్నర్‌ ప్రభుత్వ సిఫారసులను స్వయంగా పరిశీలించి, వాస్తవిక ఆధారాలతో ఒక నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అవకాశం ఇస్తున్నట్టు స్పష్టంచేసింది. గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగ సంస్థలు సామరస్యంగా పరిష్కరించుకుంటామంటే, అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ కామెంట్‌ చేశారు. ఆయన నవ్వుతూ చేసిన ఈ వ్యాఖ్యలతో కోర్టు రూం నవ్వులతో నిండిపోయి… ఆహ్లాదకరంగా మారింది. ”రాజ్యాంగబద్ధ వ్యవస్థలైన ప్రభు త్వం, గవర్నర్‌ ఈ విషయంపై ఒకే అభిప్రాయానికి వచ్చి పరిష్కరించుకుంటే మంచి దే. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు” అని అన్నారు. అలాగే, గవర్నర్‌ కార్యాలయ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం… తదుపరి విచారణను జులై 22వ తేదీకి వాయిదా వేసింది.
ఇంకా పెండింగ్‌ లోనే కోదండ రాం, అజారుద్దీన్‌ నియామకాలు…
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ ఆనాటి రాష్ట్ర మంత్రి వర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. రాజకీయ నేపథ్యం ఉందని చెబుతూ ఆ ఇద్దరి పేర్లను అప్పటి గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని ఇద్దరూ వేర్వేరుగా హై కోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. గతేడాది జనవరి 13న కోదండరాం, ఆమీర్‌ అలీఖాన్‌ పేర్లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం సిఫారసు చేసింది. దీనికి గవ ర్నర్‌ ఆమోదం తెలిపారు. అయితే, హైకోర్టులో కేసు విచారణ దశలో ఉండ గా తమ కోటాలో మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారని శ్రవణ్‌ కుమార్‌, సత్యనారా యణ మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాలకు చెందిన సుధీర్ఘ వాదనల తర్వాత 2024, మార్చి 17న హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరిం చింది. శ్రవణ్‌ కుమార్‌, కుర్రా సత్యనారాయణల నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్‌ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు తీర్పులో వెల్లడించింది. అలాగే, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్‌ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేయగా, ప్రస్తుతం అవి గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -