Thursday, April 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. జ‌ర్న‌లిస్టు మృతి

లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. జ‌ర్న‌లిస్టు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఇజ్రాయిల్ తూట్లు పొడుస్తుంది. సౌత్ లెబ‌నాన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సైన్యం జ‌రిపిన దాడిలో ఐద‌గురు మృతి చెందారు. మృతుల్లో ఒక‌రు జ‌ర్న‌లిస్టు అని ఆ దేశ మీడియా నేష‌న‌ల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని అట్-తిరి గ్రామంలో మొద‌ట‌గా ఓ వాహ‌నంపై ఇజ్రాయిల్ సైనికులు కాల్పులు జ‌రిపారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మ‌రో రెండు వాహనాలను లక్ష్యంగా దాడులు చేయ‌గా, ముగ్గురు చ‌నిపోగా అందులో ఒక్క‌రు జ‌ర్న‌లిస్ట్ మృతి చెందాడు.

జర్నలిస్టులపై ఇజ్రాయిల్ దాడిని లెబనాన్ సమాచార మంత్రి పాల్ మోర్కోస్ ఖండించారు.”ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, వారి భద్రతకు ఇజ్రాయెల్ పూర్తిగా బాధ్యత వహిస్తుంద‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. అదేవిధంగా దక్షిణ లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని హిజ్బుల్లా గ్రూప్ ఉల్లంఘించిందని ఇజ్రాయిల్ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -