Monday, September 14, 2026
E-PAPER
Homeఖమ్మంరేపు ఏరియా జీఎం కార్యాలయంలో 'పెన్షన్ అదాలత్'

రేపు ఏరియా జీఎం కార్యాలయంలో ‘పెన్షన్ అదాలత్’

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రేపు (మంగళవారం) ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ‘సీఎంపీఎఫ్’  కో-ఆర్డినేషన్ కమిటీ మీటింగ్, ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎంపీఎఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ త్రైపాక్షిక (ట్రైపార్టైట్) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ నుంచి పదవీ విరమణ పొందిన రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెన్షన్, పీఎఫ్ సంబంధిత సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సత్తుపల్లి ఏరియా పరిధిలోని రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు అందరూ ఈ పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని, తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా సింగరేణి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి, కమిటీ ప్రతినిధులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -