Monday, September 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణపయ్యకు పొంచిఉన్న కల్వర్టుల ముప్పు.!

గణపయ్యకు పొంచిఉన్న కల్వర్టుల ముప్పు.!

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని ఊరినడి బొడ్డున శిథిలావస్థలో ఉన్న శానిటేషన్ కల్వర్టులు, రోడ్డు గుంతలు, రంధ్రాలు తేలి ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన చెందారు. ఇలాంటి రోడ్డులో వినాయక నిమర్జనం ఎలా చేయొలి.? శిథిలావస్థలో ఉన్న కల్వర్టు రోడ్డు దాటాలంటే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలుగుతోందని వినాయక నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు ముక్కుపిండి వసూళ్ళు చేసే సిబ్బందికి సమస్యలు కంటికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. గణేష్‌ నిమజ్జన సమయానికైనా రోడ్డు మరమ్మత్తు పనులు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే గణేష్ విగ్రహాలతో వెళుతున్న వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. చత్రపతి శివాజీ చౌక్ ముందు, బజార్ హనుమాన్ మందిర్ ముందు, మైబు సాబ్ ఇంటి పక్కన, అలాగే శంకర్ గౌడ్ షాపు పక్కన రోడ్డు, కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -