Monday, September 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పండగపూట నీళ్ల కష్టాలు

పండగపూట నీళ్ల కష్టాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
వినాయక చవితి పండగ పూట మండల కేంద్రంలోని వార్డులలో తీవ్ర నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సోమవారం నవతెలంగాణతో కాలనీవాసులు మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా నీళ్లకోసం ఆపసోపాలు పడుతున్నామనీ, అధికారులకు చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి ఇన్‌చార్జి కావడంతో రెండు మండలాలకు న్యాయం చేయలేకపోతున్నారనీ అధికారులు అంటున్నారని చెప్పారు. మిషన్‌ భరీరథ అధికారులు ఎక్కడ ఉంటున్నారో .. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందనీ, ఇప్పటికైనా డివిజన్‌, జిల్లా అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరానికి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని జుక్కల్ గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -