Monday, September 14, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి మహాగణపతిని దర్శించుకున్న టీజీఐడీసీ చైర్మన్

సత్తుపల్లి మహాగణపతిని దర్శించుకున్న టీజీఐడీసీ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి పట్టణ శివారులోని జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న మహాగణపతిని టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు సోమవారం  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ​గణనాథుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా విజయబాబు ఆకాంక్షించారు.

​విఘ్నాలన్నింటినీ తొలగించే వినాయకుడు అందరికీ సకల శుభాలను ప్రసాదించాలని ఆయన కోరారు. ​ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తోట సుజలరాణి, మట్టా ప్రసాద్, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు),
కాంగ్రెస్ నాయకులు తోట గణేష్, పొంగులేటి, ​మువ్వా అభిమానులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -