Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రకృతి వ్యవసాయపై రైతులకు శిక్షణ కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయపై రైతులకు శిక్షణ కార్యక్రమం

- Advertisement -

ఎన్ఏంఎన్ఎఫ్ కిట్ల పంపిణీ
మండల వ్యవసాధికారి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని వల్లంకుంట గ్రామంలో  ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ సాగు)పై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీజ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు,పురుగుమందుల వినియోగం వల్ల నేల సారవంతత తగ్గిపోవడం,పంటల నాణ్యత దెబ్బతినడం, రైతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని వివరించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయం ఉత్తమ మార్గమని పేర్కొంటూ, రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అనుసరించాలని సూచించారు.

శిక్షణలో భాగంగా జీవామృతం, నీమాస్త్రం,అగ్న్యాస్త్రం వంటి సేంద్రియ ద్రావణాల తయారీ విధానాలను సవివరంగా వివరించారు.ఈ పద్ధతులు పంటలను పురుగుల నుండి రక్షించడంతో పాటు నేలలో సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదపడతాయని, దీని ద్వారా పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు.తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు పొందే విధంగా ప్రకృతి వ్యవసాయం రైతులకు ఉపయుక్తమని స్పష్టం చేశారు.కృషి సఖులకు ప్రత్యేక సూచనలు అందిస్తూ, గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో వారు ముఖ్య పాత్ర పోషించాలని అధికారులు సూచించారు.రైతులు పరస్పరం అనుభవాలు పంచుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు.

ఈ కిట్‌లో కరపత్రం, టోపీ, నోట్‌ప్యాడ్, పెన్, గుర్తింపు కార్డు, క్యాలెండర్, జ్యూట్ బ్యాగ్ ఉన్నాయి. ఈ కిట్లు రైతులకు శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో ప్రకృతి వ్యవసాయం పై చైతన్యం పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో సేంద్రియ సాగును విస్తృతంగా ప్రోత్సహించేందుకు అధికారులు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.కార్యక్రమం విజయవంతంగా సాగడంతో పాల్గొన్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ అనూష,షార్ప్ ఎన్జీఓ,జిల్లా నోడల్ అధికారి మణికుమార్, సర్పంచ్ బొమ్మ రజిత, కొండ రాజమ్మ,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -