నవతెలంగాణ-హైదరాబాద్/ నాచారం
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ పరిధిలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్‌కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు బి. శ్రీధర్, ఉపాధ్యక్షుడు భిక్షపతి, సలహాదారు ఎ. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బీఎంఎస్ నూతన అధ్యక్షుడిగా బి. రాజ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా ఎస్. అబ్బులు కొనసాగనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ. యాదగిరి, కోశాధికారిగా బి. యెల్లయ్య, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఇ. బాబు బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షుడిగా బి. బాబురావును ఎంపిక చేశారు.
అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేతల్, సలహాదారుగా నటేష్‌ను నియమించారు. నూతన కమిటీ యూనియన్ సభ్యుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. యూనియన్‌ను మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల సాధనలో ముందుండాలని నిర్ణయించారు.



