- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో చంబా-కోటీ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వాహనం అదుపుతప్పి 300 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లడంతో 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



