Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅగాఖాన్‌ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

అగాఖాన్‌ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగాఖాన్‌ ఫౌండేషన్‌ది అత్యంత కీలక పాత్ర అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగాఖాన్‌-Vతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అగాఖాన్‌ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందన్నారు. ఆ ఫౌండేషన్‌ సాయంతో మండలి భవనాన్ని, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించామన్నారు. మూసీ నది పునరుజ్జీవానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో మంత్రి అజారుద్దీన్‌, సీఎస్‌ సంజయ్‌జాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -