- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని ఆవల్గావ్ గ్రామంలో మంగళవారం లబ్దిదారులకు స్మార్ట్రేషన్ కార్డులను తహశీల్దార్ ఎండీ ముజీబ్, ఆ గ్రామ సర్పంచ్ మాన్యబాయి సంయుక్తంగా పంపిణీ చేశారు. అదేవిధంగా ఎస్ఐఆర్ ఓటరు నమోదు సవరణ పరిశీలన, గ్రామపంచాయతీ పరిధిలోని 183 సర్వే నెంబర్లులో ప్రభుత్వ అసైన్డ్ భూమిని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఎస్ఐఆర్ నోటీసుల జారీ మార్పులు చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు అంశాలను పంచాయతీ పాలకవర్గం తీర్మానించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన అసైన్మెంట్ భూమి దరఖాస్తులను తహసిల్దార్ ఎండి ముజీబ్ కు సర్పంచ్ అందజేశారు.
- Advertisement -



