Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన

ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయనీ, వరి పంటలు సాగు చేస్తే ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతులు ఆరుతడి పంటలే సాగుచేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేర, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మంగళవారం  మండలంలోని వల్లపురావుపల్లి, రాణిపేట గ్రామాలలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు.

కళాకారులు పాటలు పాడుతూ.. రైతులకు ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాకాలమే ఎండాకాలంగా మారిందని, ఆరుతడి పంటలు సాగుచేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని మహ్మద్ గౌస్ రైతులకు సూచించారు. ఎక్కువ పెట్టుబడి పెట్టి అప్పులపాలు కావొద్దనీ, ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతులు పడుతున్న కష్టాలపై నాటిక రూపంలో రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సాయిలు, జడ్చర్ల మార్కెట్ డైరెక్టర్ సత్యం గౌడ్, నాయకులు జాంగిరు ,మల్లేష్ కృష్ణ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కొమ్ము కృష్ణ ,బండారి రవిశంకర్, కిందింటి కిరణ్ ,నరేందర్, శివ, సికిందర్, అరుణ, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -