Tuesday, September 15, 2026
E-PAPER
Homeఖమ్మంమండల స్థాయి క్రీడల్లో విజేతగా నిలిచిన 'చైతన్య' టెక్నో స్కూల్

మండల స్థాయి క్రీడల్లో విజేతగా నిలిచిన ‘చైతన్య’ టెక్నో స్కూల్

- Advertisement -

– మండల ‘ఛాంపియన్‌షిప్’  కైవశం
నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి మండలం ​సదాశివునిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి ఆటల పోటీలలో చైతన్య టెక్నో స్కూల్ 18 బహుమతులతో అగ్రస్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ వై. మురళీకృష్ణ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల మధ్య జరిగిన ఈ పోటీలలో ప్రతిభ చాటి వరుసగా రెండోసారి సత్తుపల్లి మండల ‘ఛాంపియన్‌షిప్’ టైటిల్‌ను కైవసం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు 4 ప్రథమ, 8 ద్వితీయ, 6 తృతీయ స్థానాలను సాధించి బహుమతులు గెలుచుకున్నారు.

అద్భుత ప్రదర్శన కనబరిచిన 24 మంది విద్యార్థులు తదుపరి జోనల్ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. పాఠశాలలో క్రీడలకు ప్రత్యేక పీరియడ్లు కేటాయించి, అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయులతో తర్ఫీదు ఇవ్వడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఛాంపియన్‌షిప్ సాధనకు కృషి చేసిన విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్, వి. సురేంద్రలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల యాజమాన్యం ఆర్. సుజాత, ఆర్. రాకేష్, ఎం. రవికుమార్, వై. ఉష, ఉపాధ్యాయ బృందం విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -