Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా యువనేత అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా యువనేత అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ- నవాబు పేట
జడ్చర్ల నియోజకవర్గ బీఆరెస్ పార్టీ యువ నేత దోండ్లపల్లి మాజీ ఎంపీటీసీ చించోడు అభిమన్యు రెడ్డి జన్మధిన వేడుకలు నవాబు పేట మండల పరిధిలోని కాకర్లపహడ్ సమీపంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ప్రాంగణంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బీఆరెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ,కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హాజరై జనం గుండెల్లో ఆదరాభిమానాలను పొందుతూ పేదల గుండెల్లో దేవునిలా వెలుగొందుతున్న యువనేతకు జనం నీరాజనాలు పలికారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సన్మానించి కేక్ తినిపించి భవిష్యత్తు ప్రజానాయకుడిగా పేరుప్రఖ్యాతులు గాంచిన గొప్ప నాయకునిగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, యువత అధ్యక్షుడు మెండె శ్రీనివాస్  యువత ప్రధాన కార్యదర్శి రఘు గౌడ్ నర్సింహ నాయక్.మాజి ఎంపీపీ లు మాజీ ఎంపీటీసీ లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు మాజీ ప్రజాప్రతినిధులు బీఆరెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -