Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

నవతెలంగాణ- నవాబు పేట
నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాతీయ పెన్షనర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీపీఏ) రాష్ట్ర స్థాయి సదస్సు డిమాండ్ చేస్తుందని ఎన్సీసీపీఏ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ మోహన్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తాప్రా గౌరవాధ్యక్షులు ఎంఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సు పలు తీర్మానాలను ఆమోదించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ,1972 నుండి సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన అనేక తీర్పులను నిర్వీర్యం చేస్తూ, నష్టదాయకమైన పెన్షన్ ధృవీకరణ ఆక్ట్ ను రద్దు చేయాలని, 8వ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సును సవరించాలనీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంక్, కోల్, ఎల్ఐసీ,జీఐసీ పెన్షన్లను నవీకరించాలనీ, కనీస ఈపీఎస్ పెన్షన్ రూ.9000 లకు పెంచాలని డిమాండ్ చేసింది.

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెన్షన్ కమ్యూటేషన్ విలువపై కోత కాలాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలనీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిన విధంగా 65,70,75 సంవత్సరాలకు అదనపు పెన్షన్ ను మంజూరు చేయాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్.పీ.ఎస్, యూపీఎస్ ను రద్దు చేసి, నిర్వాచిత పెన్షన్ పథకం(ఓపీఎస్)తో పాటు సీనియర్ సిటిజన్ ప్రయాణ రాయితీని పునరుద్దరించాలనీ, పి.ఎఫ్.ఆర్.డీ.ఏ చట్టాన్ని రద్దు చేయాలని, వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని కోరింది. 50 శాతం డీఏ, డీఆర్ ను బేసిక్ పెన్షన్ లో విలీనం చేయాలనీ,18 నెలల పెండింగ్ డీఏ, డీఆర్ లను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కేంద్రం స్పందించకుంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -