- Advertisement -
నవతెలంగాణ- అచ్చంపేట
పట్టణంలో రక్షిత మహిళ సొసైటీ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా అంబలి కేంద్రం నిర్వహించడం అభినందనీయమని పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్ అన్నారు. గురువారం కోట కిషోర్ ప్రశాంతి ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అంబలి దాతలుగా అంబలి కేంద్రానికి ఒక్క రోజు అయ్యే ఖర్చు నిర్వాహకులకు అందజేశారు. పట్టణంలో చిరు వ్యాపారాలు, పేదలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎండాకాలంలో రెండు నెలలు వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలకు అంబలి పోసి వారి దాహాన్ని, ఆకలిని తీరుస్తున్న రక్షిత మహిళ సంఘం కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షిత మహిళ సంఘం సభ్యులు, పద్మశాలి సంఘం కార్యదర్శి గంజి రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -



