Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్టాక్‌ మార్కెట్లకు భారీ నష్టాలు..

స్టాక్‌ మార్కెట్లకు భారీ నష్టాలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధరలు పెరగడంతో మదుపర్లలో ఆందోళన పెరిగింది. దీంతో మెటల్‌, రియల్టీ, కెమికల్‌ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. చివరి గంటలో ఒత్తిడి మరింత పెరగడంతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.

సెన్సెక్స్‌ 777.94 పాయింట్లు పడిపోయి 74,003.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 279.50 పాయింట్లు కోల్పోయి 23,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కీలకమైన 23,300 స్థాయిని కోల్పోయింది. ఇప్పుడు 23,000 స్థాయిపై మదుపర్ల దృష్టి నెలకొంది. ఈ స్థాయి కూడా కోల్పోతే నిఫ్టీ 22,800 వరకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ పుంజుకుంటే 23,300-23,500 మధ్య నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -