Friday, April 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ డ్రైవర్ మృతి..సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ మృతి..సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. “క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది” అని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -