Wednesday, September 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. వినాయక చవితి కావడం, ప్రజలంతా మండపాలకు పరిమితం కావడంతో తిరుమలలో రద్దీ తగ్గింది. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కేవలం 4 గంటల వ్యవధిలోనే పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. రద్దీ నియంత్రణలో ఉండటంతో క్యూలైన్లలో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గడం వల్ల సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -