Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుపార్ట్‌టైమ్ టీచర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పార్ట్‌టైమ్ టీచర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

 నవతెలంగాణ-సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు/కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్ టీచర్లను నియమించేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోగా చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సమర్పించాలని సూచించారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ ఉదయం 10:00 గంటలకు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజు తాజా ఫొటోలతో చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమో మరియు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం జిల్లా సమన్వయ అధికారి, టి జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ , చిట్కుల్ ను 9704550253, 9640382248 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -