- సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి కే దీప
నవతెలంగాణ-వనపర్తి: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి కే దీప అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం మర్రికుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి దీప మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాను జాగ్రత్తలు పాటిస్తూ వినియోగించాలని సూచించారు. అదేవిధంగా డ్రగ్ అబ్యూస్, మోటార్ వాహనాల చట్టం, బాల్యవివాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం మరియు ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్స్ శ్రీదేవి, రఘు, పాఠశాల బృందం ఇందిరా మరియు ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.



