Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుఅమరవీరుల ఆశయ సాధనకై పోరాడుదాం

అమరవీరుల ఆశయ సాధనకై పోరాడుదాం

- Advertisement -
  • సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్

 నవతెలంగాణ-ఆలేరు టౌన్:  సాయుధ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఆశాయ సాధనకై పోరాడుదాం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణం  పరిధిలోని  బహదూర్ పేటలో గోరంతల రామచంద్ర రెడ్డి, ఆకవరం యాదగిరి రెడ్డి  స్థూపాలకు సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్  మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోని  దున్నేవాడికే భూమి కావాలని, నైజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురొడ్డి నిలిచి పోరాడారన్నారు. వెట్టి విముక్తి కొరకై ,భూశిస్తూ పంట పండిన పండగ పోయిన వసూలు చేసే పద్ధతిని రద్దు చేయాలని కట్కూరి రామచంద్ర రెడ్డి నేతృత్వంలో ప్రజలు ఉద్యమించారన్నారు. విద్యుత్తు సాధన కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు, ఆలేరు మండల కార్యదర్శి చౌడమైన కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు కందుల మధు, భారత మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి మాటూరి జానమ్మ, పేరపు ఐలయ్య, దానయ్య, శ్రీను, కృష్ణ,చారి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -