Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుజాతీయ మాల మహానాడు శ్రీ రామగిరి గ్రామ కమిటీ ఎన్నిక

జాతీయ మాల మహానాడు శ్రీ రామగిరి గ్రామ కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు: మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో జాతీయ మాల మహానాడు గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత తెలిపారు. బుధవారం జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిట్టమల్ల మహేష్ ఆదేశాల మేరకు కమిటీ కమిటీని నిర్వహించి నియామక పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ మాల మహానాడు శ్రీరామగిరి  గ్రామ అధ్యక్షులు జంజీరాల రమేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్,మరియు శ్రీరామగిరి గ్రామ కమిటీని పూర్తిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల ప్రధాన కార్యదర్శి మద్దెల రమేష్, అద్దంకి యువసేన మండల అధ్యక్షులు బాణాల సంజీవ, మండల ఉపాధ్యక్షులు మయ్య వెంకన్న, మండల నాయకులు మయ్య వీరన్న, గాజుల ఉప్పలయ్య, కారం రమేష్, జంజీరాల నరేష్, పల్లె సుందర్, గాజుల శేఖర్, గాజుల కిరణ్, చదల రవి, గుర్రాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -