Thursday, September 17, 2026
E-PAPER
Homeజిల్లాలుఆత్మకూర్‌‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం 

ఆత్మకూర్‌‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం 

- Advertisement -

 నవతెలంగాణ ఆత్మకూర్ 

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ఆత్మకూర్ పట్టణంలోని  మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహశీల్దార్ ఐకెపి, మున్సిపాలిటీ కార్యాలయం, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, మార్కెట్ యాడ్, సింగల్ విండో కార్యాలయలలో  గురువారం ఉదయం  జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, అంబేద్కర్  విగ్రహాలని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌పర్సన్ జి నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ ఎండి రహమతుల్లా, తహసిల్దార్ చాంద్ పాషా, ఎంపీడీవో శ్రీరామ్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి రమేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ ఎ. రేష్ కుమార్, ఆయా శాఖల అధికారులు డిసిసి జిల్లా కార్యదర్శి తులసిరాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వర్, కౌన్సిలర్లు సద్దల తులసి వెంకట్ రాములు, కోట్ల తిరుపతి, కో ఆప్షన్ జహంగీర్ శీను, సౌజన్య గంగ, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఈర్లదిన్నె శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు పరమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్దాల వెంకట్ రాములు, అజ్మత్,  గడ్డం శ్రీకాంత్ తోపాటు ఆయా కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -