- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఎస్ఐఆర్ ఓటర్ నమోదు సవరణ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న వాటి సవరణకు తగిన ఆధారాలు సమర్పించాలని తహశీల్దార్ ఎండీ ముజీబ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కొడిచర గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



