Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హమారా ప్రసాద్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి

హమారా ప్రసాద్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి

- Advertisement -

రాయపోల్ పోలీస్‌స్టేషన్‌లో దళిత సంఘాల ఫిర్యాదు
నవతెలంగాణ – రాయపోల్ 

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్‌ అంబేద్కర్‌ను కించపరిచేలా ‘అంబేద్కర్‌ కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రచించిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోని దేశద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం రాయపోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ కె.మానసకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్‌ దేశ ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు.

అలాంటి మహానేతపై అభ్యంతరకరమైన రీతిలో పుస్తకం రాయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల దళిత, బహుజన వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.హమారా ప్రసాద్‌పై విచారణ జరిపి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వివాదాస్పదంగా పేర్కొంటున్న పుస్తకంపై కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్‌ చరిత్ర, రాజ్యాంగ విలువలను వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. పుస్తకం విడుదలను ప్రభుత్వం అడ్డుకోకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కొత్తపల్లి ఉపసర్పంచ్ స్వామి, సొక్కం స్వామి, బాలకృష్ణ, నవీన్, కరుణాకర్, మధుసూదన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -