నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామ రాజు, రఘుబాబు, మహేష్, శ్రీని వాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యం గార్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఈ కథ నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. నేను నెల్లూరులో చదివాను. అక్కడ రిలేటబుల్‌గా ఉండే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేశాను. ఈ కథకి వెన్నెముక ఫ్రెండ్షిప్. దాని చుట్టూ ఇంటెన్సిటీ, థ్రిల్లింగ్, కామెడీ.. ఇవన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు దేశభక్తి ఉన్న వాడు. ఇంకొకడు తను హ్యాపీగా ఉన్నాడా లేదా అనేది చూసుకునే క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్గా కథ ఉంటుంది. ఈ కథ రాయడానికి పర్సనల్‌గా నేను చూసిన ఒక ఇన్సిడెంట్ కారణం. స్పై అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమందికి ఈ సినిమా చూపించాం. చూసిన వాళ్లందరూ ‘దురంధర్’ లాంటి సినిమా, కాక పోతే ఇది కొత్త వాళ్లతో చేశారని చెప్పారు. మొదట్లో ఈ సినిమా చూసి అసలు ఇది సెన్సార్ క్లియర్ అవుతుం దా అని సందేహం వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పినట్టే ఇది సెన్సార్‌లో చాలా డిలే అయింది. ఆ కంటెంట్ ఏంటి అనేది మీరు థియేటర్లో చూస్తారు. డిలే జరిగినా వాళ్లు కం టెంట్‌ని టచ్ చేయలేదు. అదే మాకు సినిమాపై నమ్మకాన్ని పెంచింది. నెక్స్ట్ నా స్వీయ దర్శకత్వంలోనే ఓ సరికొత్త రొమాంటిక్ కామెడీని తెరకెక్కించబోతున్నాను.
యూనిక్ కాన్సెప్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



