Friday, September 18, 2026
E-PAPER
Homeఆటలుఆసియా గేమ్స్‌: సెమీస్‌కు టీమ్‌ఇండియా

ఆసియా గేమ్స్‌: సెమీస్‌కు టీమ్‌ఇండియా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా గేమ్స్‌ మహిళల క్రికెట్‌లో భారత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జపాన్‌ 19.5 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తెలుగు అమ్మాయి శ్రీచరణి 4 వికెట్లతో సత్తాచాటగా.. షఫాలీ వర్మ 2, శ్రేయాంకా పాటిల్‌, దీప్తి శర్మ చెరో వికెట్‌ తీశారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షఫాలీ వర్మ 15 బంతుల్లో 40 పరుగులతో (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచింది. రిచా ఘోష్‌ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. సెమీఫైనల్లో భారత్‌ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 రన్స్‌కే ఆలౌటైంది. శ్రీ చరణి (4/10) అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకుంది. జపాన్ బ్యాటర్లలో ఓపెనర్ అయకా కటో (25) టాప్‌ స్కోరర్. ఆమెతోపాటు మరో ఓపెనర్ హరున ఇవాసాకి (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించడం గమనార్హం. మై యనగిడ (0), అహ్లియా చందెల్ (0), ఎరికా టోగుచి (0), నొనొహ యసుమోటో (0) డకౌట్ కాగా.. ఎరిక ఓడా (5), షిమాకో కటో (3), అకరి కనో (2), హినాసె గోటో (1), అయుమి (4) పరుగులు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -