- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న కరవును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. తాగునీరు, కరవు నివారణ చర్యల కోసం ఈ నిధులను జాతీయ విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని కోరింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద అదనంగా మరో 50 రోజులు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
- Advertisement -



