Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగణపతి మండపం వద్ద విషాదం.. విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

గణపతి మండపం వద్ద విషాదం.. విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో విద్యుత్‌ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గాంధీనగర్‌లోని గణపతి మండపం వద్ద వర్షానికి తడిసిన విద్యుత్‌ వైర్లను సరిచేస్తుండగా జంపుల అరవింద్‌ (26) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఇటీవల కల్వకుర్తి మండల బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్‌ ఆకస్మిక మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -