- Advertisement -
నవతెలంగాణ – తొగుట
ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో పాడి గేదే మృత్యువాత చెందిన ఘటన మండలంలోని లింగంపేటలో చోటు చేసుకుంది. బాధిత రైతు చిక్కుడు యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే సాయంత్రం స్థావారం వద్ద ఎద్దును కట్టేసి వచ్చాననీ, తాడు తెంచుకొని ప్రమాదవశాత్తూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ షాక్ గురై మృత్యువాత చెందిందని ఆవేదన చెందాడు. పాడి గేదే మృతితో దాదాపు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు యాదయ్య వాపోయాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
- Advertisement -



