Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజన్వాడ ఫాంహౌస్‌ వద్ద ఉద్రిక్తత

జన్వాడ ఫాంహౌస్‌ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శనివారం కాంగ్రెస్ ఎంపీ,ఎమ్మెల్యేల బృందం జన్వాడ ఫాంహౌస్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫాంహౌస్‌ భూములను ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ఫాంహౌస్ నిర్మాణానికి అనుమతులు లేవని, నాలాపై ఫాంహౌస్‌ను కట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే జన్వాడ ఫాంహౌస్‌కు వచ్చామని తెలిపారు. ఫాంహౌస్‌ను నాలాపై కట్టారని.. దీని నిర్మాణానికి అనుమతులు లేవన్నారు.

కేటీఆర్ స్నేహితుడే ప్రదీప్‌రెడ్డి అని.. ఆయనకు ఫాంహౌస్ భూమి ఎలా వచ్చిందని నిలదీశారు. కేటీఆర్ జన్వాడ ఫాంహౌస్‌లో అద్దెకు ఉంటున్నారని ప్రదీప్ చెప్పారని తెలిపారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అక్రమంగా జన్వాడలో ఫాంహౌస్ నిర్మించారని ఆరోపణలు గుప్పించారు. సత్యం రామలింగరాజు భూముల్లో ఫాంహౌస్ నిర్మించారని తెలిపారు. కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో ఇక్కడ భూమి ఉందన్నారు. కేటీఆర్ అత్త పేరుపై కూడా భూములు ఉన్నాయని చెప్పారు. ఈ భూమలన్నీ శతబిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీవి అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -