Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్యామగడ్డ తండాలో నీటి పరిష్కారానికై బోర్‌వెల్స్‌

శ్యామగడ్డ తండాలో నీటి పరిష్కారానికై బోర్‌వెల్స్‌

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
శ్యామగడ్డ తండా ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా ఆలా సంతోషి భూపాల్ రెడ్డి శనివారం బోర్‌వెల్స్ ఏర్పాటు కార్యక్రమం చేపట్టారు. చాలాకాలంగా తండాలో తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నామి, సమస్యను గుర్తించి బోర్‌వెల్స్ వేయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బోర్‌వెల్స్ ఏర్పాటు ద్వారా నీటి సమస్యకు కొంతమేర తగ్గిందని అన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. శ్యామగడ్డ తండా అభివృద్ధికి భవిష్యత్తులో కూడా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలా సంతోషి భూపాల్ రెడ్డికి తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -