- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
మండల పరిధిలోని తరోడ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన ఏర్పాటుకు వైద్యా, రెవెన్యూ శాఖ అధికారులు శనివారం భూమిని పరిశీలించారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 153లో ఉన్న రెండెకరాల భూమిని డీఎంఅండ్ హెచ్‌వో రాజేందర్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో డా. ఆకాశ్, ఆర్‌ఐ నారాయణపటేల్, సర్పంచ్ అరిపొద్దిన్ లు పరిశీలించారు.
పీహెచ్‌సీ ఏర్పాటుకు అనువుగా ఉన్న భూమి విస్తీర్ణం, స్థల పరిస్థితులు తదితర వివరాలను అధికారులు పరిశీలించి, పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు.
- Advertisement -



