నవతెలంగాణ-మద్నూర్
మండలంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి శనివారం పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు గానూ పోలీస్, ఫైర్ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాఫిక్, అగ్నిప్రమాద నివారణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగేందుకు భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, బిచ్కుంద ఎస్సై రాజు, ఫైర్ అధికారి మదన్ నర్సింలు, గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, పలువురు గణేష్ మండలాల నిర్వాహకులు, పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.



