Saturday, September 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రేపు ముధోల్ లో గణేష్ నిమజ్జనం

రేపు ముధోల్ లో గణేష్ నిమజ్జనం

- Advertisement -

పోలీసుల భారీ బందోబస్తు
నవతెలంగాణ – ముధోల్‌
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఆదివారం అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇందుకు గానూ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భైంసా ఎఎస్పీ పత్తిపాక సాయికిరణ్ పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగనుంది. నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీసులు ఇదివరకే గణేష్ మండలి, నాయకులు,శాంతి కమిటీ సభ్యులతో సమావేశాలు కూడా నిర్వహించారు.

పోలిసులు ఎప్పటికప్పుడు గణేష్ మండలను సందర్శించారు. అయితే ఆదివారం జరిగే గణేష్ నిమజ్జనానికి ఎప్పటిలాగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ముధోల్ సిఐ రవీందర్ నాయక్ నవతెలంగాణకు తెలిపారు. నిమజ్జనం రోజు ఇద్దరు డిఎస్పిలు, పదిమంది సిఐలు, 20 మంది ఎస్ఐ లు, 250 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారన్నారు. అలాగే ఆయా ప్రధాన కూడల వద్ద పోలీసు పికెటింగ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిరంతరం పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు. గణేష్ నిమజ్జనంను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -