- Advertisement -
హైదరాబాద్: జేఈఈ, ఈఏమ్‌సెట్ పోటీ పరీక్షల కోసం రెండేళ్ల పాటు క్రీడలకు దూరంగా ఉన్న తెలంగాణ యువ ప్యాడ్లర్ జతిన్ దేవ్ అద్భుత పునరాగమనం చేశాడు. తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అండర్-19 బాలుర విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో జతిన్ 4-1 తేడాతో హ్రియాన్‌పై విజయం సాధించాడు. 2024 నేషనల్ స్కూల్ గేమ్స్ చాంపియన్‌గా, వివిధ కేటగిరీల్లో ఆరుసార్లు స్టేట్ చాంపియన్‌గా నిలిచిన జతిన్ దేవ్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ (ఏఐఎంఎల్) చదువుతున్నాడు. రీఎంట్రీ ఇచ్చిన తొలి టోర్నీలోనే అండర్-19 టైటిల్ గెలిచి తన సత్తాను చాటుకున్నాడు.
- Advertisement -



