నవతెలంగాణ – హైదరాబాద్: సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. మొహియుద్దీన్ కుమారుడు ఇజ్హాన్ ఉద్దీన్ మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మొహియుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వీకార్ హోటల్ నుంచి పార్సిల్ తీసుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు ఇజ్హాన్ ఉద్దీన్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే షాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓవైసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంతోష్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల బాలుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



