Sunday, September 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గణేష్ నిమజ్జన విధులు సక్రమంగా నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల

గణేష్ నిమజ్జన విధులు సక్రమంగా నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : గణేష్ నిమజ్జనం బందోబస్తు సజావుగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో జిఎం పంక్షన్ హాల్ లో ఆదివారం గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల కేటాయింపు కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ముధోల్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తమకు కేటాయించిన ప్రాంతంలో పోలీసులు బందోబస్తును నిర్వహించాలన్నారు. సకాలంలో శోభాయాత్ర ముగించే విధంగా పోలీసులు సామరస్యంగా గణేష్ మండలి నిర్వహకులతో వ్యవహరించి, ముగించాలని సూచించారు. ఏదైనా సమస్య ఏర్పడితే పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని ఆదేశించారు. నిమజ్జన బందోబస్తును విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎఎస్పీ పత్తిపాక సాయి కిరణ్, నిర్మల్ డిఎస్పి శ్రీనివాస్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్,ఎస్ఐ బిట్ల పెర్సిస్, పోలి సిబ్బంది ,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -