Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌ ప్రభుత్వం రాక్ష‍స పాలన చేస్తోంది: హరీష్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాక్ష‍స పాలన చేస్తోంది: హరీష్‌రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తు అయిన ఎల్ నినో కంటే రేవంత్ రెడ్డే రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కరెంట్ కోతలు విధిస్తూ, నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని, రాష్ట్రంలో లేని కరవును సృష్టిస్తోందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలన్నీ కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయని, అందుకే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు పెరిగాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూనే రాక్షస పాలన సాగిస్తోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -