జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి. మల్లేష్, జి. సాయిలు
నవతెలంగాణ-సంగారెడ్డి
అంగన్వాడీ ఉద్యోగుల బిఎల్ఓ ఎస్ఐఆర్ డబ్బులు వెంటనే చెల్లించాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి. మల్లేష్, జి. సాయిలు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అంగన్వాడి టీచర్స్ అత్యంత కష్టమైన బి ఎల్ ఓ ఎస్ ఐ ఆర్ డ్యూటీ లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వీరికి బిఎల్ఓ సంవత్సరానికి రూ..12000 ఎస్ ఐ ఆర్ డ్యూటీకి రూ.6000 చెల్లిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన బి ఎల్ ఓ డబ్బులు పెండింగ్లో ఉన్నాయనీ, నేటికీ డబ్బులు చెల్లించడం లేదన్నారు.
జిల్లా అధికారులకు అడిగితే పైనుండి బడ్జెట్ రాలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. బి ఎల్ ఓ డబ్బులు అక్కడక్కడ కొంత అమౌంట్ ఇస్తున్న ఏ సంవత్సరం తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఒకవైపు ఐసిడిఎస్ పనులు చేస్తూ ఎంత ఒత్తిడి ఉన్న మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు బి ఎల్ ఓ ఎస్ ఐ ఆర్ డ్యూటీలు అదనంగా రాత్రి వరకు కష్టపడుతున్న కష్టానికి తగ్గ ఫలితం లేదని అన్నారు. ఇప్పటికే తక్కువ వేతనంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పనులు అనేకం చేస్తూ అదనంగా ఈ డ్యూటీలు చేస్తున్న ప్రభుత్వాలు చెల్లిస్తామన్న డబ్బులు సకాలంలో చెల్లించక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే బిఎల్ఓ ఎస్ ఐ ఆర్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.



