Monday, September 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గెస్ట్ టీచర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ టీచర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ-బజార్‌హత్నూర్
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఫిజికల్ సైన్స్ గెస్ట్ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి (ఎస్ ఓ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్ మెథడాలజీతో బీఈడీ, టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా కేజీబీవీ బజార్‌హత్నూర్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 99897 42468 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -