నవతెలంగాణ-కుభీర్
గ్రామల్లో యువత అన్ని రంగాల్లో ముందుండాలని గ్రామ సర్పంచ్ మొరే పల్లవి దత్తహరి పటేల్ అన్నారు. సోమవారం మండలంలోని గోడపూర్ గ్రామానికి చెందిన మొరే సంగీత ఆనంద్ రావు, పటేల్ కూతురు మొరే అనుష్క మెడికల్ సీట్ సాధించారు. గ్రామానికి చెందిన కదా యశోద అవధూత్ పటేల్ కుమారుడు సత్యనారాయణ ఇంజనీరింగ్ స్థానంలో చోటు లభించడంతో వారికి, తల్లిదండ్రులకు స్థానిక సర్పంచ్ పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇద్దరి యువకులకు ఎంబీబీస్, ఇంజనీరింగ్ లో చోటు లభించడం చాలా గ్రామానికి అభినందనీయమని సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి యువతి యువకులు వీరిద్దరిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని మంచి ఫలితాలు సాధించి గ్రామానికి మండలానికి గర్వకారణము అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.



