- Advertisement -
నవతెలంగాణ-టేకుమట్ల
గణేష్ నిమజ్జనాలలో డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించవద్దని డీజే నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో డిజె నిర్వాహకులతో ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామాలలో గణపతి నిమజ్జన సమయంలో డీజే సౌండ్ సిస్టంలు ఉపయోగించకూడదని ఎస్సై జి.అమూల్య అవగాహన కల్పించారు. డిజె సౌండ్ సిస్టం నిర్వాహకులను, వాహనదారులను తహాసిల్దార్ వద్ద బాండోవర్ చేయించారు. సౌండ్ సిస్టం వాడినట్లయితే ఒకరికి లక్ష రూపాయలు జరిమానా, మూడు నెలలు జైలు శిక్ష ఉంటుంది అని తహసిల్దార్ స్వరూప రాణి, ఎస్సై జి అమూల్య హెచ్చరించారు.
- Advertisement -



