Tuesday, September 22, 2026
E-PAPER
Homeఖమ్మంమానవత్వంలో 'మిరాకిల్  మైండ్స్' విద్యార్థులు ముందడుగు

మానవత్వంలో ‘మిరాకిల్  మైండ్స్’ విద్యార్థులు ముందడుగు

- Advertisement -

– బ్లడ్ క్యాన్సర్ చిన్నారికి రూ. 40వేలు ఆర్థిక చేయూత 
నవతెలంగాణ-సత్తుపల్లి 

విద్యతో పాటు మానవత్వం, సేవాభావం, సామాజిక బాధ్యతను విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యంగా ‘మిరాకిల్ మైండ్స్- ది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ విద్యార్థులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. రక్త క్యాన్సర్‌తో పోరాడుతున్న ‘చార్లెస్ ఫిన్నీ’ అనే చిన్నారి వైద్య ఖర్చుల కోసం పాఠశాల విద్యార్థులు చొరవ తీసుకుని రూ. 40వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఉమ్మడి సహకారంతో ఈ మొత్తాన్ని సమకూర్చి, చిన్నారి కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు.

​చదువు అంటే కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన విద్య  అని ఈ సందర్భంగా విద్యార్థులు నిరూపించారు. విద్యార్థుల సేవా నిరతిని, వారి ఆలోచనా దృక్పథాన్ని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు  అభినందించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులను ఇలాంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాకర్ మొండ్రు తెలిపారు. ​పిల్లల్లో మానవత్వం, దయ, సామాజిక బాధ్యత వంటి ఉత్తమ విలువలను పెంపొందించడమే తమ పాఠశాల ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపాల్ రత్నాకర్  పేర్కొన్నారు. ​అవసరంలో ఉన్న చిన్నారికి బాసటగా నిలిచిన విద్యార్థుల ఉదార మనసును పలువురు స్థానికులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -