నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలోని పండ్ల వ్యాపారి కటకం మల్లేశం ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, మాజీ కౌన్సిలర్ చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆలేరు పట్టణంలో మంగళవారం మల్లేశం నివాసం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మల్లేశం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. అధైర్య పడవద్దని, అండగా ఉంటామన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, 3వ వార్డు కౌన్సిలర్ యాట శివతో కలిసి పులమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పట్టణంలోని పండ్ల వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఆయన మృతి పట్ల సంతాపం, సానుభూతి తెలియజేస్తూ అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ సభ్యులు, బంధుమిత్రులు, కాలనీవాసులు పాల్గొన్నారు.



