కెఫీన్, నికోటిన్ వాడకాన్ని పరిమితం చేయండి. రాత్రి పడుకునే ముందు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే, అది అసౌకర్యం, అజీర్ణం కలిగిస్తుంది. వ్యాయామం మీ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. వ్యాయామం నిద్ర-మేల్కొనే చక్రాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి రాత్రిపూట తీవ్రమైన వ్యాయామానికి దూరంగా ఉండాలి.ఒత్తిడి లేకుండా ఉండండి. యోగా, కండరాల సడలింపు వంటి ఒత్తిడి తగ్గింపు పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కచ్చితంగా రోజు నిద్రపోయేందుకు స్థిరమైన సమయాన్ని సెట్ చేసుకోవాలి. వారాంతాల్లో కూడా స్థిరమైన నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేయండి. స్థిరమైన నిద్ర మీ శరీరం అంతర్గత గడియారాన్ని నియంత్రిస్తుంది. ఇది సమయానికి నిద్రపోవడానికి, మేల్కొనడానికి సహాయపడుతుంది. పడుకునే ముందు చదవడం, వెచ్చని నీటితో స్నానం చేయడం, శ్వాస వ్యాయామాలు వంటి విశ్రాంతి పద్ధతులను ప్రారంభించండి.
నిద్ర బాగాపట్టాలంటే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



