నవతెలంగాణ – హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి బుధవారమే చివరి రోజు కావడంతో 9వ రోజు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే లక్ష మందికిపైగా భక్తులు బడా గణేశుడిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు పొడవైన క్యూలైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన భక్త బృందానికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 25న నిమజ్జనం ఉండటంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. నిమజ్జన ఏర్పాట్ల నేపథ్యంలో గురువారం దర్శనాలను నిలిపివేయనున్నారు. చివరి రోజు సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. భక్తులందరికీ ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అర్ధరాత్రి నుంచే సుమారు 10 క్వింటాళ్ల పులిహోర, శనగలు, దద్దోజనం ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి నేడే చివరి రోజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



