Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీఓ నరేందర్‌రెడ్డికి సీపీఐ(ఎం) నాయకుల శుభాకాంక్షలు

ఎంపీడీఓ నరేందర్‌రెడ్డికి సీపీఐ(ఎం) నాయకుల శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్‌
రాయపోల్‌ మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కె. నరేందర్‌రెడ్డిని సీపీఐ(ఎం) నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పూలమాల శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ.. ఎంపీడీవో మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేయాలని సీపీఐ(ఎం) నాయకులు ఎంపీడీవోను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు పొట్టేల స్వామి, ఉడిది నాగరాజు, కాసుల మహేందర్‌ రెడ్డి, బోడ ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -