Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'సపర్య’ అండ

‘సపర్య’ అండ

- Advertisement -

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, ఆర్థికంగా వెనుకబడిన వారికి భరోసా ఇవ్వడం.. ఒంటరి వృద్ధులకు తోడుగా నిలవడం.. సేవను ఒక కార్యక్రమంగా కాకుం డా బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సపర్య – వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ పేరుతో నూతన ప్రాజెక్టును ప్రారం భిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాప కుడు, నటుడు కాదంబరి కిరణ్ ప్ర‌క‌టించారు.ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘గత 13 ఏళ్లుగా ‘మనం సైతం’ ద్వారా సమాజంలో ఆపదలో ఉన్నవారికి, అవసరార్థు లకు వివిధ రూపాల్లో సహాయాన్ని అందిస్తున్నాం. వీటిని మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ‘సపర్య’ ప్రాజెక్టును రూపొం దించాం. ఈ ప్రాజెక్టులో భాగంగా అనాథా శ్రమం, వృద్ధాశ్రమం, పేదలకు అందుబాటులో ‘జనతా వైద్యం’ ఆసుపత్రి ఏర్పాటు, కేవలం వైద్యం అందించడమే కాకుండా.. రోగులు, వృద్ధులు, అనాథలు మానసిక ప్రశాంతతతో ఉండేలా ఈ ప్రాజెక్టు ప్రత్యేకంగా ఉంటుంది. వైద్యం, వసతి, ఆత్మీయత.. ఈ మూడింటినీ ఒకే చోట అందించాలన్నదే ‘సపర్య’ లక్ష్యం. సినీ కార్మికుల పిల్లలకు విద్యా భరోసా కార్య్రకమం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఐదు గురు సినీ కార్మికుల పిల్లలకు ఉచిత హాస్టల్ వసతితో పాటు రెండేళ్ల పాటు నీట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -